Sindhu Pushkaralu | ‘సింధు’ పుష్కర సారథి సుచరిత
sindhu pushkaralu | ఆధ్యాత్మికతకు నిలయం భారతదేశం. సమస్త ప్రాణకోటికి జలమే ప్రాణాధారం.. నదులే అపార సంపదలు. దేశంలో గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు ప్రవహిస్తూ సస్యశ్యామలం

హైదరాబాద్ : ఆధ్యాత్మికతకు నిలయం భారతదేశం. సమస్త ప్రాణకోటికి జలమే ప్రాణాధారం.. నదులే అపార సంపదలు. దేశంలో గంగ, సింధు, యమున, కావేరి, గోదావరి, కృష్ణ ఇలా ఎన్నో నదులు ప్రవహిస్తూ సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ నదులు మనకు కేవలం నీటి ప్రవాహాలు కావు మాత్రమే కాదు దేవతా స్వరూపాలు. సనాతన హిందూ సాంప్రదాయ ప్రకారం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉన్న వివిధ పుణ్యనదులు పుష్కరాలను జరుపుకోవడం పరంపరగా వస్తున్నది. ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న సింధూ నది పుష్కరాలు ఈ నెల 21న ప్రారంభం కాగా.. డిసెంబర్ 2వ తేదీ వరకు జరుగనున్నాయి.
బెదిరింపులు లెక్క చేయక…
సాంప్రదాయ పరంగా జరుపుకునే పుష్కరాల సమయంలో కశ్మీర్లో ఉగ్రవాదుల బెదిరింపులు షరా మామూలే. పుష్కరాలు నిలిపివేయాలని, తదితర తీవ్ర ఒత్తిళ్లు మొదలయ్యాయి. అయితే, బెదిరింపులకు తలొగ్గకుండా పుష్కరాలను ప్రకటించిన తేదీల్లోనే జరుపుకుంటామని పుష్కర కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఉత్కంఠ భరితమై పరిస్థితుల్లో.. ఓ వైపు ఉగ్రవాదుల తుపాకీ చప్పుళ్ల మధ్యలో.. భారత సైన్యం రక్షణ కవచంగా నిలువగా పుష్కరాలు దిగ్విజయంగా సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి నాలుగు వేలాది భక్తులు సింధు నది పుష్కరాలకు హాజరయ్యారు. సతాన సంప్రదాయం పట్ల తెగించిన విశ్వాసంతో తెలుగు రాష్ట్రాల నుంచి 3500 మంది హాజరయ్యారు.

వారి ధైర్యం.. సుచరిత
తెలుగు రాష్ట్రాల నుంచి ఇంత మంది ఎంతో ధైర్యం, సాహసంతో పుష్కరాలకు హాజరవడం వెనుక ఓ తెలుగు మహిళ కృషి ఉన్నది. సింధు పుష్కర కమిటీ జాతీయ జనరల్ సెక్రెటరీ వ్యవహరిస్తూ అనుక్షణం తెలుగువారు, కశ్మీర్ అధికారులతో, పుష్కరఘాట్ వద్ద సమన్వయం చేసున్నది. ఆమె చెరుకుచర్ల సుచరిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సనాతన ధర్మం నిలబడాలని అందరం అనుకుంటాం.
కానీ, ధర్మం నిలబడాలంటే ధర్మం కోసం పూనుకొని ముందుకు వెళ్లినప్పుడే ధర్మం నిలబడ్డది అని చెప్పగలం. నేనేం గొప్ప పని చేయలేదు. నా ధర్మం కోసం సనాతన ధర్మ బంధువుల అందరినీ కలుపుకొని సింధు పుష్కరాలకు వెళ్లాను. చాలా మంది కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల దాడులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నారు. అది నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే నా ధర్మం కోసం ఎంతదూరమైనా, ఎంత కష్టమైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడే కశ్మీర్ వెళ్లాను.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయానికి, భూభాగం కాపాడేందుకు భారత సైన్యం కష్టపడుతూనే ఉంది. మరి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, మన వంతు బాధ్యతగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని, సుచరిత ధైర్యం మరొక్కసారి గుర్తు చేస్తున్నది.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

