Karnataka CM | సీఎం పీఠంపై పట్టువదలని డీకే.. ఈ ఐదేండ్లు నాకే కుర్చీ ఇవ్వాలని సిద్ధరామయ్య అభ్యర్థన
Karnataka CM | కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఖాయమైనట్టు కనిపిస్తున్నది! శనివారం జరిగిన అల్పాహార విందులో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తున్నది.
Karnataka CM | బెంగళూరు, నవంబర్ 29: కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎం పదవికి ఎసరు వచ్చే పరిస్థితి ఖాయమైనట్టు కనిపిస్తున్నది! శనివారం జరిగిన అల్పాహార విందులో ఈ విషయంపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తున్నది. ఈ అయిదేండ్లు పదవిని తనకే విడిచి పెట్టాలని, 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టవలసిందిగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యర్థించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అయితే రహస్య ఒప్పందం ప్రకారం తనకు ఇప్పుడే ఆ పదవిని అప్పగించాలని డీకేఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు నాయకత్వ మార్పుపై ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సిద్ధరామయ్య శనివారం ఉదయం డీకే శివకుమార్‌ను అల్పాహార విందుకు ఆహ్వానించారు.
అయితే ఈ భేటీలో ప్రతిష్ఠంభనకు పరిష్కారం లభించలేనట్లు సమాచారం. ఈ సమావేశంలో ఇద్దరు నాయకులు తమ తమ వైఖరులకు కట్టుబడి ఉన్నారని కాంగ్రెస్ నాయకులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన సందర్భంగా ఐదారుగురు నాయకుల సమక్షంలో అధికార పంపకం ఒప్పందం జరిగిందని, రెండున్నరేండ్ల చొప్పున ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాల్సి ఉంటుందని డీకేఎస్ ఇటీవల బహిరంగంగా వెల్లడించారు. ఆ ప్రకారం చూస్తే ఈ నవంబర్ 20వ తేదీకి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు పూర్తయింది.
మా మధ్య విభేదాలు లేవు!
నాయకత్వ మార్పుపై గడచిన వారం రోజులుగా కర్ణాటకలో రగులుతున్న రగడకు శనివారం జరిగిన మీటింగ్‌లో పరిష్కారం లభించలేదు. మరో విడత సమావేశం కావాలని తామిద్దరం నిర్ణయించుకున్నామని, తానిచ్చే లంచ్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారని డీకే శివకుమార్ వెల్లడించడం ఈ సమస్య పూర్తిగా సమసిపోలేదన్న సంకేతాలను అందచేస్తోంది. బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ అనంతరం సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, భవిష్యత్తులోనూ ఉండబోవని స్పష్టం చేశారు. 2028 ఎన్నికలే మా అజెండా. స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ముఖ్యం. వాటి గురించి మేమిద్దరం చర్చించాం. 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే అంశాన్ని కూడా చర్చించాం. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. భవిష్యత్తులో కూడా ఎటువంటి విభేదాలు ఉండవు అంటూ సిద్ధరామయ్య వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అంతేగాక ప్రస్తుత సంక్షోభంపై పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని కూడా పునరుద్ఘాటించారు. పార్టీ అధిష్ఠానం ఏం చెప్పినా పాటించాలని తామిద్దరం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. రేపటి నుంచి ఎటువంటి గందరగోళం ఉండదని, ఇప్పడు కూడా ఎటువంటి గందరగోళం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొందరు మీడియా ప్రతినిధులే గందరగోళాన్ని సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలని బీజేపీ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. తప్పుడు ఆరోపణలు చేసే అలవాటు బీజేపీ, జేడీఎస్‌కి ఉంది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఆ రెండు పార్టీలు అంటున్నాయి. వారికి ఉన్న బలం కేవలం 60(బీజేపీ), 18(జేడీఎస్). అదో వృథా ప్రయాస. వారి ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొంటాం అని సిద్ధరామయ్య చెప్పారు.
అవసరమైతే మళ్లీ ఢిల్లీకి..
డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్య వ్యాఖ్యలను సమర్థించారు. కాంగ్రెస్ పార్టీకి విధేయుడైన సైనికుడిగా తనను తాను అభివర్ణించుకుంటూ పార్టీ అధిష్ఠానం కబురు చేస్తే ఢిల్లీకి వెళ్లడానికి తాను సిద్ధమని డీకేఎస్ చెప్పారు. నాయకత్వ అంశానికి సంబంధించింనంత వరకు పార్టీ అధిష్ఠానం నిర్ణయాన్ని పాటిస్తాం. వారేం చెప్పినా అది మా నిర్ణయమే. కాంగ్రెస్ పార్టీ క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోందని మాకు కూడా తెలుసు. కర్ణాటక కీలక భూమిక పోషిస్తుందని మేము నమ్ముతున్నాం. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో 2028లో మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తాం అని డీకేఎస్ ప్రకటించారు. ఇద్దరు నాయకులు ఎక్స్‌లో పోస్టులు పెట్టి అధిష్ఠానం ఆదేశాలు తాము పాటించినట్లు సూచనలు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

