Siddhu a Human Bomb | కాంగ్రెస్ పార్టీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధికార ప్రతినిధి మంజిందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దూ ఒక మానవ బాంబు ( human bomb ) అని ఆరోపించారు.
सिद्धू एक unstable आदमी है। ये एक Human Bomb हैं, जहां जायेंगे वहां फटेंगे।#Sidhu #ThokoTaali #PunjabPolitics pic.twitter.com/h35DX1I1Qf
— Manjinder Singh Sirsa (@mssirsa) September 28, 2021
పంజాబ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్దూ అస్థిరమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఆయన ఎక్కడికెళ్లినా సర్వనాశనం అవుతుందని పేర్కొన్నారు.
పంజాబ్ సీఎంగా దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించడం సిద్ధూ సహించలేకపోయారని మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేర్కొంది. అందుకే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని ఆరోపించింది.