శనివారం 04 జూలై 2020
National - Jun 20, 2020 , 19:52:55

చైనాకు తగిన బుద్ధి చెప్పాలి : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌

చైనాకు తగిన బుద్ధి చెప్పాలి : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌

ఢిల్లీ : భారత్‌-చైనా సరిహద్దులో 20 మంది జవాన్లను బలిగొన్న డ్రాగన్‌ దేశానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. సరిహద్దులో భారత భూ భాగాన్ని ఆక్రమించాలని చూస్తున్న చైనా దేశానికి సైన్యం తగిన బుద్ధిచెబుతోందన్నారు.

చైనా వస్తువులను బహిష్కరించి ఆర్ధికంగా దెబ్బకొట్టాలని ట్వీటర్‌ వేదికగా రాష్ర్ట ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా తీరుకు వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమువుతున్నాయి. చైనా వస్తువులను తగలబెడుతున్నారు. యాప్‌లను సైతం బ్యాండ్‌ చేస్తున్నారు.logo