మంగళవారం 24 నవంబర్ 2020
National - Nov 19, 2020 , 11:59:50

క‌రాచీ స్వీట్స్ పేరులో క‌రాచీ తీస్త‌వా.. లేదా?

క‌రాచీ స్వీట్స్ పేరులో క‌రాచీ తీస్త‌వా.. లేదా?

ముంబై: ‌ముంబైలోని బాంద్రాలో క‌రాచీ స్వీట్స్ పేరుతో ఓ మిఠాయి దుకాణం న‌డుస్తున్న‌ది. ఆ షాప్ పేరుపై అధికార శివ‌సేన పార్టీకి చెందిన నితిన్ గంద్‌గౌక‌ర్ అనే నాయ‌కుడు అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. వెంట‌నే ఆ పేరు నుంచి క‌రాచీని తీసివేయాల‌ని షాప్ య‌జ‌మానిని హెచ్చ‌రించాడు. మీకు సమ‌యం ఇస్తున్నాం. క‌రాచీ తీసివేసి మారాఠీలో మ‌రో పేరు పెట్టుకోవాల‌ని చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారుతున్న‌ది. 


గ‌తంలో క‌రాచీ బేక‌రీ విష‌యంలో కూడా ఇలాంటి డిమాండే వ‌చ్చింది. క‌రాచీ అనే పేరును తీసివేయాల‌ని చాలా న‌గ‌రాల్లో ఆందోళ‌న‌లు చేశారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రిలో ఉగ్ర‌వాదులు పుల్వామాపై దాడిచేసిన త‌ర్వాత బెంగ‌ళూరులో ఉన్న క‌రాచీ బేక‌రీ వ‌ద్ద కొంద‌రు వ్య‌క్తులు ఆందోళ‌న చేశారు. బేక‌రీ పేరులోని క‌రాచీని తీసేయాల‌ని, బేక‌రీని మూసేయాల‌ని డిమాండ్ చేశారు. దీంతో బేక‌రీ యాజ‌మాన్యం క‌రాచీ పేరుపై గుడ్డ క‌ప్పేసింది. అంతేకాదు బేక‌రీపై జాతీయా జెండా ఎగుర‌వేసింది. తాము పాకిస్థాన్ వాళ్లం కాద‌ని, 53 ఏండ్లుగా దేశంలో ఇదే పేరుతో వ్యాపారం చేస్తున్నామ‌ని, క‌రాచీ పేరుకు పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.  ‌‌