2024 Lok Sabha polls | ఇవే నా చివరి ఎన్నికలు : శశి థరూర్
2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు.
న్యూఢిల్లీ : 2024 లోక్‌సభ ఎన్నికల్లో (2024 Lok Sabha polls) చివరిసారిగా తిరువనంతపురం నుంచి బరిలో దిగుతానని, అక్కడి నుంచి ఇవే తన చివరి ఎన్నికలని కాంగ్రెస్ నేత శశి థరూర్ సంకేతాలు పంపారు. రానున్న లోక్‌సభ ఎన్నికలే తిరువనంతపురం నుంచి తన చివరి ఎన్నకలని అంటూ యువ రాజకీయనేతలకు మార్గం సుగమం చేయడాన్ని తాను నమ్ముతానని అన్నారు. అయితే రాజకీయ కెరీర్లో ఎప్పుడూ ఊహించనివి జరుగుతుంటాయని అంగీకరించారు.
ఇవే నా చివరి ఎన్నికలని ఆయన విస్పష్ట సంకేతాలు పంపారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే తిరువనంతపురం ప్రజలకు 20 ఏండ్ల సేవలు పూర్తవుతాయని అప్పుడు సంతోషంగా తప్పుకుంటానని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఇదే ఖరారని చెప్పలేమని, ఎలాంటి పరిస్ధితులు ఉత్పన్నమవుతాయో ఎవరికి తెలుసని అన్నారు. తిరువనంతపురం నుంచి తాను పోటీ చేయడంపై అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
పార్టీ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటిస్తేనే తాము పనిచేసుకుంటామని వెల్లడించారు. తిరువనంతపురంలో తనపై బీజేపీ ఓ జాతీయ నేతను బరిలో దింపుతుందనే వార్తలపై స్పందిస్తూ కాషాయ పార్టీ సవాల్‌ను స్వీకరిస్తానని ప్రజలే మెరుగైన అభ్యర్ధిని ఎన్నుకుంటారని అన్నారు. 15 ఏండ్లుగా నియోజకవర్గానికి తాను చేసిన సేవలనే ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావిస్తానని చెప్పారు. ఎవరిని గెలిపిస్తారనేది ప్రజల నిర్ణయంపై ఆధారపడిఉంటుందని శశి థరూర్ పేర్కొన్నారు.
Read More :
Viajaykanth | విజయకాంత్ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీసు కథల్లో నటన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

