దక్షిణాదికి ధరల దడ
నిత్యావసర సరుకుల ధరలు దక్షిణాది రాష్ర్టాల్లో భారీగా పెరుగుతుండటం సంచలనంగా మారింది. గత రెండేండ్లలో బియ్యం, పాలు, చక్కెర, ధనియాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఉప్పు ధర మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది.
- నిత్యం పెరుగుతున్న బియ్యం, పాలు, చక్కెర, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు
- గత రెండేండ్లలో భారీగా పెరుగుదల
- సామాన్యుడి జేబుకు భారీ చిల్లు
న్యూఢిల్లీ : నిత్యావసర సరుకుల ధరలు దక్షిణాది రాష్ర్టాల్లో భారీగా పెరుగుతుండటం సంచలనంగా మారింది. గత రెండేండ్లలో బియ్యం, పాలు, చక్కెర, ధనియాలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఉప్పు ధర మాత్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖకు చెందిన ధరల పర్యవేక్షణ విభాగం డాటాను విశ్లేషించి సౌత్ ఫస్ట్ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోనే ఈ ధరల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు నివేదిక చెప్పింది. కేరళలో ప్రతి ఏడాది సరిపోయే డాటా లేకపోవడంతో ఆ రాష్ర్టాన్ని కొన్నింటికే పరిమితం చేస్తున్నట్టు సౌత్‌ఫస్ట్ తెలిపింది.
సన్‌ఫ్లవర్ నూనె ధరల్లో భారీ పెరుగుదల..
సన్‌ఫ్లవర్ నూనె ధరలు అంచనాలకు మించి పెరిగిపోయాయి. 2024 నుంచి 2026 వరకు పరిశీలిస్తే ఒక్కో రాష్ట్రంలో తేడా గణనీయంగా పెరిగింది. తెలంగాణలో కిలో నూనె రూ.110 నుంచి రూ.192కి, కర్ణాటకలో రూ.114.38 నుంచి రూ.192.25కి, తమిళనాడులో రూ.115.71 నుంచి రూ.19 3.58కి, ఏపీలో రూ.115.50 నుంచి రూ.18 8.67కి పెరిగింది.

చేదెక్కిన చక్కెర..
సౌత్‌ఫస్ట్ నివేదిక ప్రకారం చక్కెర ధరల్లోనూ గణనీయంగా పెరుగుదల కనిపించింది. కర్ణాటకలో కిలో చక్కెర రూ.43 నుంచి రూ.53.34కి, తమిళనాడులో రూ.44.28 నుంచి రూ.53.58కి, ఏపీలో రూ.43.50 నుంచి రూ.49కి, తెలంగాణలో రూ.40.50 నుంచి రూ.45కి పెరిగింది.
అన్ని రాష్ర్టాల్లో పెరిగిన పాల ధరలు..
పాల ధరలు నాలుగు రాష్ర్టాల్లోనూ గణనీయంగా పెరిగాయి. లీటరు పాల ధర కర్ణాటకలో రూ.43.50 నుంచి రూ.51.97కి, తెలంగాణలో రూ.57.20 నుంచి రూ.67.64, ఏపీలో రూ.56 నుంచి రూ.60.52కి, తమిళనాడు రూ.41.67 నుంచి రూ.44.53కి పెరిగింది.

బియ్యం ధరల్లో భారీ మార్పులు
బియ్యం ధరలు కూడా సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. తెలంగాణలొ కిలో బియ్యం ధర రూ.41.80 నుంచి రూ.57.64కి పెరిగింది. కర్ణాటకలో రూ.48.25 నుంచి రూ.61.72కి, తమిళనాడులో రూ.48.44 నుంచి రూ.60.25కి, ఏపీలో రూ.51 నుంచి రూ.55.44కి పెరిగింది.

పెరిగినవి ఎక్కువ.. తగ్గినవి తక్కువ
2024 నుంచి 2026 వరకు కందిపప్పు, ఎర్ర మిరపకాయలు, పసుపు రేట్లు కొద్ది మేర తగ్గాయి. ఉప్పు మాత్రం రాష్ర్టాన్ని బట్టి పెరగడం, తగ్గడం జరిగింది. పంటల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం, నిల్వలు, సేకరణ, దేశీయ, అంతర్జాతీయ ధరలు ఈ నాలుగు రాష్ర్టాల్లో వంటింటి సరుకుల ధరలపై ప్రభా వం చూపించాయని సౌత్‌ఫస్ట్ వెల్లడించింది.
తెలంగాణలో పెరుగుతున్న ఉల్లి ధరలు..
- మహారాష్ట్ర నుంచి తగ్గిన సరఫరా
హైదరాబాద్, ఆగస్టు 23 (నమసే ్త తెలంగాణ):తెలంగాణలో ఉల్లి ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. మొన్నటి వరకు రూ.20- రూ.30 ఉన్న కిలో ఉల్లి ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. నగరంలోని మలక్‌పేట్ మార్కెట్లో క్వింటాల్ గతంలో రూ.2,500- రూ. 3,000 వరకు ఉండగా, ప్రస్తుతం రూ.4,500-రూ.5,000కు చేరింది. మహారాష్ట్ర , కర్నూల్, గుజరాత్ తదితర రాష్ర్టాల నుంచి తెలంగాణకు ఉల్లి సరఫరా తగ్గిందని వ్యాపారులు పేర్కొన్నారు.
దీంతో పాటు ఖరీఫ్‌లో ఎల్ నినో ప్రభావం, వర్షాకాలంలో పంట సాగు ఆలస్యం కావడం వల్ల అన్ని ప్రాంతాల్లో దిగుబడి తగ్గింది. దీంతో మార్కెట్‌కు సరుకు రాక తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగి ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఉల్లి ధరలు పెరుగుతుండటంపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన ఉల్లిని కిలోకు రూ.60, రూ.70 చెల్లించి కొనుగోలు చేయడం భారంగా మారిందని వాపోతున్నారు. ఉల్లి ధరలు పెరగడంతో హోటళ్ళు, రెస్టారెంట్లపై కూడా ప్రభావం పడుతున్నది. వంటల తయారీలో ఉల్లి వినియోగం ఎక్కువగా ఉండటంతో.. రెస్టారెంట్లలో ఉల్లిపాయకు ప్రత్యేక ధరలు వసూలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

