Sharad Pawar | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) ప్రసంగిస్తున్న సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నవీ ముంబై (Navi Mumbai) లో పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. అయితే, వర్షంలో తడుస్తూనే ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు (delivers speech in rain). ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ సీన్ 2019లో జరిగిన ఘటనను గుర్తు చేసింది.
2019లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు అక్టోబర్ 18న సతారాలో పార్టీ అభ్యర్థి గెలుపు (లోక్‌సభ) కోసం పవార్ ప్రచారంలో పాల్గొన్నారు. అక్కడ ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో పక్కనున్న వారు గొడుగును ఆఫర్ చేసినప్పటికీ.. పవార్ దాన్ని తిరస్కరించారు. ఇది పార్టీకి వాన దేవుడు అందిస్తున్న ఆశీర్వాదం అని తెలిపారు. వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కావడంతో నాటి జ్ఞాపకాలను పార్టీ గుర్తు చేసుసుకుంటోంది.
Also Read..
Wedding In The Air | కూతురి పెళ్లిని గాల్లో జరిపించిన తండ్రి.. హాజరైన 300 మంది అతిథులు
Deepfake Videos | రష్మిక, కత్రినా, కాజోల్.. ఇప్పుడు అలియా డీప్‌ఫేక్ వీడియో వైరల్
Pneumonia | చైనాలో న్యుమోనియా.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం