దుబాయ్: బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్(Shah Rukh Khan) పేరు మీద .. దుబాయ్‌లో షారూక్జ్ దనూబే టవర్‌ను నిర్మించారు. దనూబే ప్రాపర్టీస్ ఆ టవర్‌ను కట్టింది. 55 అంతస్తులు ఉన్న ఆ కమర్షియల్ టవర్‌ను ఇవాళ ఓపెన్ చేయనున్నారు. దుబాయ్ ఎగ్జిబిషన్ సెంటర్లో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమంలో నటుడు షారూక్ ఖాన్‌తో పాటు దనూబే గ్రూపు చైర్మెణ్ రిజ్వాన్ సాజన్ పాల్గొననున్నారు. షేక్ జైదా రోడ్డు మార్గంలో ఆ టవర్ ఉన్నది.
దుబాయ్ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు అదో కొత్త బిజినెస్ కేంద్రంగా మారనున్నది. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వర్ధిల్లనున్నట్లు దనూబే ప్రాపర్టీస్ ఫౌండర్ రిజ్వాన్ సాజన్ పేర్కొన్నారు. దుబాయ్ సిటీలో ప్రస్తుత జనాభా 40 లక్షలుగా ఉంది. 2050 నాటికి ఆ జనాభా సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. దుబాయ్ మార్కెట్ విలువ గురుగ్రామ్, ముంబై నగరాలకు పోటీగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.
షారూక్ టవర్స్‌లో 40 రకాల ఎమినిటీస్ ఉన్నాయి. స్కైపూల్, హెలీప్యాడ్, బిజినెస్ లాంజ్‌లు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు యాక్సిస్ ఈజీగా ఉంటుంది.