హసన్, జూన్ 1: జేడీఎస్ బహిష్కృత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ప్రజ్వల్ తల్లి భవాని రేవణ్ణ షాక్ ఇచ్చారు. కుమారుడిపై ఆరోపణలు, కిడ్నాప్ కేసుకు సంబంధించి విచారించేందుకు శనివారం అందుబాటులో ఉండాలని నోటీసుల్లో కోరగా.. అధికారుల బృందాలు వెళ్లే సమయానికి ఆమె ఇంట్లో లేరు. ఉదయం హోలెనరసిపుర ఇంటికి వెళ్లిన అధికారులు సాయంత్రం వరకు అక్కడే వేచిచూడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఇంటికి రాలేదు.
ఈ నేపథ్యంలో ఆమెను వెతికేందుకు సిట్ బృందాలను ఏర్పాటు చేయనున్నదని తెలిపాయి. ప్రజ్వల్‌పై లైంగిక ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రశ్నించించేందుకు శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంట్లో అందుబాటులో ఉండాలని సిట్ గురువారం భవాని రేవణ్ణకు నోటీసులు ఇచ్చింది.