Bus accident | రోడ్డు తెగడంతో లోయలోకి జారిపోయిన బస్సు.. 12 మందికి గాయాలు, నలుగురి పరిస్థితి విషమం
Bus accident | హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్‌నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్‌ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (HRTC) బస్సు.. మార్గమధ్యలో మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో లోయలోకి జారిపోయింది.
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయాన్నే సుందర్‌నగర్ యూనిట్ నుంచి ప్రయాణికులతో షిమ్లాకు బయలుదేరిన హిమాచల్‌ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (HRTC) బస్సు.. మార్గమధ్యలో మండి జిల్లాలో రోడ్డు తెగిపోవడంతో లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి.
కాగా, బస్సు లోయలో పడిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ రక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. వారిలో 12 మందికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పోరేషన్ (HRTC) ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

