నదిలో పడ్డ సైనిక వాహనం
లఢక్‌లోని తుర్తుక్ సెక్టార్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన 60 అడుగుల లోతులో ఉన్న ష్యోక్ నదిలోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించారు.
- ఏడుగురు జవాన్ల మృతి
- 19 మందికి గాయాలు
- లఢక్‌లో ఘోర ప్రమాదం
న్యూఢిల్లీ, మే 27: లఢక్‌లోని తుర్తుక్ సెక్టార్లో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కన 60 అడుగుల లోతులో ఉన్న ష్యోక్ నదిలోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సైనికులు మరణించారు. 19 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 26 మంది సైనికులు ఉన్నారు. వారంతా పార్తాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్‌కు వెళ్తుండగా వాహనం అదుపు తప్పింది. గాయపడ్డ సైనికులను వెంటనే పార్తాపూర్‌లోని 403 ఫీల్డ్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి చండీమందిర్‌లోని దవాఖానకు తీసుకెళ్లారు. ప్రమాదంపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన సైనికుల కుటుంబాల పట్ల సానుభూతి ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కలచివేసింది
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): జవాన్ల మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ‘మన జవాన్లు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుం బ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
తీవ్రంగా బాధించింది
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): లఢక్‌లో మృతి చెందిన భారత సైనికులకు ఎమ్మెల్సీ కవిత సంతాపం ప్రకటించారు. ‘మన సైనికులు మరణించడం తీవ్రంగా బాధించింది. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

