Speaker election | స్పీకర్ ఎన్నికలో ఓటు వేయలేకపోయిన ఏడుగురు ఎంపీలు..!
Speaker election | లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్‌గా నెగ్గినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దాంతో ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ ఓడిపోయినట్లయ్యింది.
Speaker election : లోక్‌సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. బుధవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. మూజువాణి ఓటుతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్‌గా నెగ్గినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. దాంతో ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె సురేష్ ఓడిపోయినట్లయ్యింది.
అయితే స్పీకర్ ఎన్నిక సందర్భంగా సభలోని ఏడుగురు ఎంపీలకు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఎందుకంటే ఆ ఏడుగురు ఇంకా లోక్‌సభ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేయలేదు. తొలి రెండు రోజుల్లో ప్రొటెం స్పీకర్ మొత్తం 235 మంది సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. మరో ఏడుగురు మిగిలిపోయారు. ఇవాళ మిగతా ఏడుగురి ప్రమాణస్వీకారాలు పూర్తికాకుండానే స్పీకర్ ఎన్నిక నిర్వహించారు.
దాంతో ఆ ఏడుగురు ఎంపీలకు స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. ఈ అవకాశం దక్కని ఎంపీల్లో ఇద్దరు ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మరొకరు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శత్రుఘ్ను సిన్హా. వీరితోపాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే చెందిన దీపక్ అధికారి, నురుల్ ఇస్లామ్, సమాజ్‌వాది పార్టీకి చెందిన అఫ్జల్ అన్సారీ (ముఖ్తార్ అన్సారీ సోదరుడు), మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

