న్యూఢిల్లీ: బీపీ గోలీ రిల్మెనిడిన్తో కేనోరబ్డిటిస్ పురుగుల ఆయుర్ధాయం పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులోని ఓ రసాయనం పురుగుల్లో వృద్ధాప్యాన్ని నెమ్మదిపరిచినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. మానవుల్లో ఈ ప్రయోగాలు విజయవంతమైతే మరింత ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కేనోరబ్డిటిస్ పురుగుల జీన్స్ మానవుల జీన్స్‌తో దాదాపు సరిపోలుతాయని, కాబట్టే పరిశోధనల కోసం వాటిని ఎంచుకున్నట్టు తెలిపారు. ఈ బీపీ ఔషధం లో క్యాలరీ డైట్లానే పనిచేస్తుందని, శరీరానికి హానీ జరగదని పేర్కొన్నారు. యాంటీ ఏజింగ్ సామర్థ్యం దీంట్లో పుష్కలంగా ఉందని వివరించారు. పరిశోధన ఫలితాలు ‘ఏజింగ్ జర్నల్’లో ప్రచురితమయ్యాయి.