హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ్ ఆర్ జోషి బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో డాక్టర్ జోషి విశేష కృషి చేశారు.
లాంగ్ రేంజ్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ డెవలప్మెంట్ కోసం ఆర్ అండ్ డీకి నాయకత్వం వహించారు. అధునాతన క్షిపణుల తయారీలో మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు.