స్కూల్ బస్సు బోల్తా.. 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లకు గాయాలు
ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 47 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు.
బెంగళూరు: ఒక స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది విద్యార్థులు, ముగ్గురు టీచర్లు గాయపడ్డారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మైసూరు జిల్లా హున్సూర్ తాలూకాలోని ధర్మపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 47 మంది విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు స్కూల్ బస్సులో ప్రయాణిస్తున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు శివమొగ్గ జిల్లా సాగర్ తాలూకాలోని తుమరి సమీపంలో వక్కోడి వద్ద ఆ స్కూల్ బస్సు ఒక పక్కకు ఒరిగి పడింది. ఈ ప్రమాదంలో 18 మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే స్పందించారు. గాయపడిన విద్యార్థులు, ఉపాధ్యాయులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రభుత్వ స్కూల్ బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ స్కూల్ బస్సు వేగంగా ప్రయాణించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక రాజకీయ నేతలు ఆసుపత్రికి క్యూ కట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

