శుక్రవారం 03 జూలై 2020
National - Jan 29, 2020 , 02:02:26

త్వరలో భారత్‌కు ఆఫ్రికా చిరుతపులి

త్వరలో భారత్‌కు ఆఫ్రికా చిరుతపులి
  • తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆఫ్రికాకు చెందిన చిరుతపులిని భారత్‌కు తీసుకొచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. అరుదైన భారతీయ చిరుతపులులు దేశంలో దాదాపు కనుమరుగయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్టీసీఏ) అధికారులు నమీబియాకు చెందిన చిరుతపులిని భారత్‌కు తీసుకొచ్చి, అది ఇక్కడి పరిస్థితులను ఏ మేరకు తట్టుకుంటుందో పరీక్షించాలని నిర్ణయించారు. ఇందుకు అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. సీజేఐ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌లు బీఆర్‌ గవాయి, సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చిరుతపులిని తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చింది. చిరుతను ఎక్కడికి తరలించాలో సమగ్రంగా సర్వే చేయాలని, అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎన్టీసీఏను ఆదేశించింది. వారికి సహకరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి తమకు ప్రాజెక్టుకు  సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించింది.logo