AAP | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు : సౌరభ్ భరధ్వాజ్
AAP : త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ అన్నారు.
AAP : త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ్ అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం పార్టీ శ్రేణులు, ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మనీష్ సిసోడియా నివాసంలో ఆదివారం పార్టీ నేతలతో కీలక భేటీ జరిగిందని తెలిపారు.
ఈ సమావేశంలో రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని మంత్రి వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని సౌరభ్ భరధ్వాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని అంతకుముందు ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.
ఇది ఘన విజయమని, ఈ విజయం కేవలం తమదే కాదని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్ధ సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్ధానం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ వెలువరించిన తీర్పు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని చెప్పారు. ఈ తరహా నియంతృత్వ పోకడలు చెల్లవని, వ్యవస్ధలను గుప్పిట్లో పెట్టుకుని ఎంతోకాలం సాగించలేరనేందుకు కోర్టు తీర్పు చెంపపెట్టు వంటిదని అన్నారు.
Read More :
Anil Ravipudi | దర్శకుడు అనిల్ రావిపూడి హీరోగా సినిమా.. ?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

