న్యూఢిల్లీ: శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కొత్త పార్లమెంటు భవనంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, న్యూఢిల్లీలోని సెంట్రల్ విస్టా పరిస్థితిని చూడాలన్నారు.
నూతన పార్లమెంటు భవనం ఓ ఫైవ్ స్టార్ జైలులా ఉందని, దీనిలో పని చేయడం సాధ్యం కాదని, సత్ఫలితాలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే, చరిత్రాత్మక పాత పార్లమెంటు భవనంలోనే పార్లమెంటు సమావేశాలను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు.