Bihar BJP: మహాకూటమికి కటీఫ్ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్.. ఇప్పుడు బీజేపీతో కలిసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరిని శాసనసభాపక్ష నేతగా, మరో నేత విజయ్ సిన్హాను శాసనసభాపక్ష ఉపనేతగా ఎన్నుకుంది.
అనంతరం బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి సుమిత్ శశాంక్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ శాసనసభాపక్ష నేత సామ్రాట్ చౌదరి, శాసనసభాపక్ష ఉపనేత విజయ్ సిన్హా ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకుంటారని ఆయన చెప్పారు. కాగా, ఇవాళ సాయంత్రమే నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.