బళ్లారి: శబరిమల అయ్యప్ప ఆలయం బంగారం చోరీ కేసులో బళ్లారి వ్యాపారి గోవర్ధన్ వద్ద నుంచి బంగారాన్ని రికవరీ చేసినట్టు శుక్రవారం సిట్ అధికారులు తెలిపారు. ఈ బంగారం 400 గ్రాములు బరువు ఉంటుందని ఎస్సీ శశిధరన్ పేర్కొన్నారు. బెంగళూరులోని ఉన్నికృష్ణన్ పొట్టి ఇంట్లో కూడా సిట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బంగారు నాణెలతో పాటు రూ.2 లక్షల విలువైన నగదును సీజ్ చేసినట్టు సమాచారం.
ఉన్నికృష్ణన్ శబరిమల ఆలయం నుంచి బంగారాన్ని అపహరించి బళ్లారిలోని రొడ్డాం జ్యువెల్లరీ వ్యాపారి గోవర్ధన్‌కు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సిట్ అధికారుల కస్టడీలో ఉన్న నిందితుల నుంచి మరింత సమాచారం సేకరిస్తున్నట్టు తెలుస్తున్నది.