న్యూఢిల్లీ : హోర్ముజ్ జలసంధి పరిసరాల్లో నెలకొన్న అనిశ్చితి నేపధ్యంలో దేశీయ రిఫైనరీలు ముడి చమురు సరఫరాను సురక్షితం చేసుకోవడంపై దృష్టి సారించాయి. సముద్ర రవాణా, కమొడిటీ ఇంటెలిజెన్స్ సంస్థ ‘కెప్లర్’ గణాంకాల ప్రకారం ఈ నెల 1 నుంచి 19 మధ్య కాలంలో రష్యా నుంచి రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. మే నెలతో పోలిస్తే 39 శాతం మేరకు పెరిగింది.
యూఎఈ నుంచి దిగుమతులు దాదాపు 6.36,00 బ్యారెళ్లు తగ్గాయి. వెనిజువెలా భారత్కు నాలుగో అతి పెద్ద సరఫరాదారుగా అవతరించగా, సౌదీ అరేబియా దాదాపు 3,84,000 బ్యారెళ్లను సరఫరా చేసింది. అమెరికా నుండి ముడి చమురు దిగుమతులు మేలో రోజుకు 2,52,000 బ్యారెళ్లుగా ఉండగా, జూన్ నాటికి 91,000 బ్యారెళ్లకు పడిపోయాయి.