ఇబ్బందిగా ఉంటే.. దేశాన్ని వీడండి : ఇంద్రేశ్ కుమార్

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీపై ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై ఇంద్రేశ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ”భారత్ లో ఉండడం ఇబ్బందైతే… నిరభ్యంతరంగా ఆయన భారత్‌ను వీడిపోవచ్చు. ఆయనకు ఏ దేశం సౌకర్యవంతమో… ఆ దేశానికి వెళ్లిపోవచ్చు.” అంటూ ఇంద్రేశ్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
ఫరూక్ అబ్దుల్లాకు శాంతిపై ఏమాత్రం నమ్మకం లేదని, హింసనే ఆయన నమ్ముకున్నారన్న విషయం ఆయన వ్యాఖ్యల ద్వారా రూఢీ అవుతోందని ఇంద్రేశ్ దుయ్యబట్టారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎలాగైతే.. ఉద్యమాలు చేశారో, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి, ప్రత్యేక రాష్ట్ర హోదాకు అలాగే త్యాగాలు చేయాల్సి ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ సీనియర్ నేత ఇంద్రేశ్ కుమార్ ఫరూక్ అబ్దుల్లాపై విరుచుకుపడ్డారు.
ఇక మరో మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీపై కూడా ఇంద్రేశ్ కుమార్ మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఆమె ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. అయితే ఈ వ్యాఖ్యలకు ఇంద్రేశ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పడం మెహబూబా ముఫ్తీకి ఫ్యాషన్ అయిపోయిందని ఆయన దెప్పిపొడిచారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఆ ఇరువురు నేతలు మానుకోవాలని, దేశ సమైక్యతకు పాటుపడాలని ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Chiranjeevi | బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 5కు చిరంజీవి గెస్ట్ .. మెగా వర్స్ వర్సెస్ అన్‌స్టాపబుల్‌పై ఆసక్తికర చర్చ!
Sabarimala Lord Ayyappa Temple | శబరిమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి భారీ క్యూ లైన్లు.. వీడియో
Suriya | ఒకే ఏడాదిలో మూడు సినిమాలతో రూ.200 కోట్ల క్లబ్.. ‘సీన్’ సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ వీడియో!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

