Yojana Bhawan | ప్రభుత్వ కార్యాలయంలో రూ.2.31 కోట్లు, బంగారు బిస్కెట్లు సీజ్
అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్‌పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు.
జైపూర్: అది ప్రభుత్వ కార్యాలయం. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ ఆఫీస్‌పై పోలీసులు దాడిచేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఉన్న కబ్బోర్డులో బ్యాగును గుర్తించారు. తెరచిచూస్తే అధికారులే విస్తుపోయారు. బ్యాగు నిండా నోట్లకట్టలు. అందులో బంగారు బిస్కెట్లు కూడా ఉన్నాయి. దీంతో దానిని సీజ్చేసిన ఘటన రాజస్థాన్‌లోని (Rajasthan) జైపూర్‌లో (Jaipur) జరిగింది.
జైపూర్‌లోని ఐటీ శాఖకు (IT Department) చెందిన యోజనా భవన్లో (Yojana Bhawan) లెక్కల్లోకిరాని డబ్బును అధికారులు గుర్తించారు. నిర్ధిష్టమైన సమాచారంతో శుక్రవారం రాత్రి యోజనా భవన్‌పై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యాగ్‌లో రూ.2.31 కోట్ల నగదు, కిలో బరువున్న బంగారు బిస్కెట్లను (Gold biscuits) గుర్తించారు. ఆ మొత్తాన్ని సీజ్‌చేసి ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అందజేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసలు ఆ డబ్బు, బంగారం ఆఫీసులోకి ఎలా వచ్చింది, అది ఎవరిదనేది గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక బృంధాన్ని ఏర్పాటుచేశామని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాత్సవ చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

