National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణలు
National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది.
National Herald case | నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald case)లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా వారు రూ.142 కోట్లు లబ్ధి పొందారని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తన వాదనలు వినిపించింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. నవంబర్ 2023లో నేషనల్ హెరాల్డ్‌తో ముడిపడి ఉన్న రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసే వరకూ ఆ నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోనియా, రాహుల్ అనుభవించారని కోర్టుకు తెలిపారు.
నేషనల్ హెరాల్డ్ పేపర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీని ఈడీ గతంలో విచారించింది. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపారన్న ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేపట్టాయి. అయితే, సీబీఐ విచారణ అర్ధాంతరంగానే నిలిచిపోగా.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతూ వస్తున్దని. ఇటీవల ఈ కేసులో 2023, నవంబర్‌లో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కి చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించి.. నోటీసులు జారీ చేసింది. ఈడీ ఇప్పటి వరకు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియాకు చెందిన దాదాపు రూ.751.9కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఆయా ఆస్తుల్లో అద్దెకు ఉంటున్న వారు తమకే ఆ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. అక్రమ చలామణి నిరోధక చట్టంలోని సెక్షన్ (8) నిబంధన 5(1) ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు చెప్పింది.
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. దీన్ని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అంటే ఏజేఎల్ ప్రచురించింది. 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ వార్తాపత్రిక మూసివేశారు. అయితే, ఇక్కడే ఈ వివాదం ప్రారంభమైంది. దీని తర్వాత 2010లో, యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (YIL) అనే కంపెనీ ఏర్పడింది. దీంట్లో దీనిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 38-38శాతం వాటాను కలిగిఉన్నారు. ఈ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి 2012లో వైఐఎల్ రూ.2వేలకోట్లకుపైగా విలువైన ఏజేఎల్ ఆస్తులను కేవలం రూ.50లక్షలకు కోనుగోలు చేసిందని.. ఇది మోసమని ఆరోపించారు. ఇక ఈడీ చార్జిషీట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరు నేతలపై చార్జిషీట్ దాఖలు చేయడం అనేది ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార రాజకీయాలకు పాల్పడడం, బెదిరింపులకు ప్రత్నించడమే తప్ప మరొకటి కాదన్నారు. భారత జాతీయ కాంగ్రెస్.. దాని నాయకత్వం మౌనంగా ఉండదు.. సత్యమేవ జయతే! అంటూ ట్వీట్ చేశారు.
Also Read..
Enforcement Directorate: యూకో బ్యాంక్ మాజీ సీఎండీ అక్రమంగా 6000 కోట్లు దారిమళ్లించారు: ఈడీ
Ashoka University Professor | అశోక వర్సిటీ ప్రొఫెసర్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
Jyoti Malhotra | బ్లాకౌట్ వివరాలను పాక్ ఇంటెలిజెన్స్ అధికారులకు చేరవేసిన జ్యోతి మల్హోత్ర..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Businessman Arrest | ఆదిలాబాద్‌లో బినామీ పేర్లతో ఖాతాలు, పోర్జరీలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్
పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సీఈవోకు బెస్ట్ సీఈవో అవార్డు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

