Raids | జీతం రూ.45వేలు.. రూ.కోట్లల్లో ఆస్తులు.. రిటైర్డ్ స్టోర్ కీపర్ అక్రమాస్తుల చిట్టా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
Raids | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారుల అక్రమాస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇటీవలే ఆ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్ అక్రమాస్తులు చూసి అధికారులు షాక్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆస్తులు చూసి విస్తుపోయారు. ఆరోగ్య శాఖలో చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఏకంగా రూ.కోట్లల్లో ఆస్తులను కూడబెట్టారు.
అష్పాక్ అలీ ( Ashfaq Ali ) మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ విభాగం (Health Department)లో స్టోర్ కీపర్ (store-keeper)గా పని చేస్తూ నెలకు రూ.45 వేల జీతం పొందేవాడు. ప్రస్తుతం అతను రిటైర్ అయ్యారు. అయితే, అలీ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం అందుకున్న లోకాయుక్త (Lokayukta) అధికారులు ఆయన ఇంట్లో తాజాగా సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.10 కోట్లకు పైగా విలువైన ఆస్తులను కొనుగొన్నారు. రూ.46 లక్షల విలువైన బంగారం, వెండితోపాటు రూ.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు.. అలీ ఇంట్లోని వస్తువులు చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. మాడ్యులర్ కిచెన్, లక్షల రూపాయల విలువైన షాన్డిలియర్, ఖరీదైన సోఫాలు, సోకేసులు, రిఫ్రిజరేటర్, టీవీ ఉన్నాయి. ఓ చిరుద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఇంట్లో ఇంత ఖరీదైన వస్తువులు చూసి షాక్ అయ్యారు. మొత్తం ఆయన ఆస్తుల విలువ రూ. 10 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అలీ భార్య, కుమారుడు, కుమార్తె పేరిట ఉన్న రూ. 1.25 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన 16 స్థిరాస్తుల పేపర్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వీటితోపాటు నాలుగు భవనాలు, ఒక నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి కూడా సమాచారం అందుకున్నారు. అంతేకాదు, మూడంతస్తుల భవనంలో ఓ పాఠశాలను కూడా నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ మేరకు అలీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిని అవినీతి భాగోతం
మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (Madhya Pradesh Police Housing Corporation) లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్ (contractual in-charge assistant engineer) గా పనిచేస్తున్న హేమ మీనా (Hema Meena) ఇంట్లో మే నెలలో లోకాయుక్త అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. నెలకు రూ.30వేలు జీతం తీసుకునే మీనా.. కోట్లల్లో ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. ఆ సోదాల్లో ఏకంగా రూ.7 కోట్లకు పైనే ఆస్తులు బయటపడ్డాయి. వాటితోపాటు 7 లగ్జరీ కార్లు, విలువైన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీ, కోటి విలువైన విలాసవంతమైన ఇల్లు, ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి.
Also Read..
Group-2 Exam | ఈ నెల 29, 30వ తేదీల్లో గ్రూప్-2 పరీక్ష : టీఎస్పీఎస్సీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Party | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీల నియామకం
GST reforms | జీఎస్టీలో సంస్కరణలు.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. వీరికి లబ్ధి
Bihar Man Kills Wife | అనుమానంతో భార్యను చంపి.. మృతదేహాన్ని కాలువలో పడేసిన భర్త
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్‌కు రాష్ట్ర స్థాయి అవార్డు
Singireddy Niranjanreddy | రిజర్వాయర్లకు నీటిని తరలించి చూపిస్తాం.. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరిస్తున్న: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

