న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: బొద్దింకలు అనగానే చాలామందికి చిరాకు అనిపిస్తుంటుంది. వంట గదుల్లో ఉంటూ ఇబ్బంది కలిగిస్తాయి. కానీ ఆ బొద్దింకలే మనకు చాలా ఉపయోగపడనున్నాయి. బొద్దింకలకు సెన్సర్ల వంటి చిన్నపాటి మెషీన్లను అమర్చి పరిశోధకులు వాటిని రోబో బొద్దింకలుగా మార్చారు.
భూకంపాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు వీటిని వినియోగించనున్నారు. వీటినే సైబర్గ్ కీటకాలు అని పిలుస్తున్నారు. సహాయక చర్యల్లో మనకు ఇవి చాలా ఉపయోగపడుతాయని పరిశోధకులు చెబుతున్నారు.