Watch: బ్యాంకు సిబ్బందిని గన్స్‌తో బెదిరించి 50 లక్షలు దోపిడీ.. వీడియో వైరల్
Robbers Loot Bank | బ్యాంకులోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు గన్స్ చూపించి సిబ్బందిని బెదిరించారు. వారిని ఒక గదిలో నిర్బంధించారు. ఆ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: బ్యాంకులోకి ప్రవేశించిన కొందరు వ్యక్తులు గన్స్ చూపించి సిబ్బందిని బెదిరించారు. వారిని ఒక గదిలో నిర్బంధించారు. ఆ బ్యాంకు నుంచి రూ.50 లక్షలు దోచుకున్నారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Robbers Loot Bank) బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం శ్రీకృష్ణ చౌక్‌లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్ ముందు సుమారు 12 మంది వ్యక్తులు ఉన్నారు. బ్యాంకు తెరిచిన తర్వాత ముఖాలకు ముసుగువేసుకుని లోపలకు ప్రవేశించారు. గన్స్ చూపించి బ్యాంకు ఉద్యోగులను బెదిరించారు. వారిని ఒక చోట నిర్బంధించారు. బ్యాంకులోని రూ.50 లక్షలు దోచుకున్నారు. అక్కడి నుంచి పారిపోయే ముందు ఒక మహిళా కస్టమర్ వద్ద ఉన్న బ్యాగును కూడా లాక్కొనిపోయారు.
కాగా, బ్యాంకు దోపిడీ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. దొంగలను గుర్తించి అరెస్ట్ చేసేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు బ్యాంకు దోపిడీకి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప్‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘షేక్‌పురాలో పట్టపగలే నేరస్తులు యాక్సిస్ బ్యాంక్‌లోకి ప్రవేశించి తుపాకీలతో బెదిరించి 50 లక్షలు లూటీ చేశారు. నిజానికి బీహార్‌లో ప్రధాని, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘మంగళ్‌రాజ్’ ప్రభుత్వానికి ఇది నిదర్శనం’ అని విమర్శించారు.
शेखपुरा में सरकारी बदमाशों ने दिनदहाड़े 𝐀𝐗𝐈𝐒 बैंक में घुस पिस्तौल और बंदूक़ों के बल पर 𝟓𝟎 लाख लूट लिए।
दरअसल प्रधानमंत्री जी और मुख्यमंत्री नीतीश कुमार जी की बिहार में मंगलराज की यही परिभाषा है। pic.twitter.com/LbY2WgpP5C
— Tejashwi Yadav (@yadavtejashwi) July 1, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

