న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో మళ్లీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతున్నది. వరుసగా నాలుగో రోజైన శనివారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసల మేర పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఢిల్లీలో ఆందోళన చేపట్టారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు వ్యతిరేకంగా వినూత్న నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 31న గురువారం ఉదయం 11 గంటలకు ప్రజలంతా తమ ఇళ్ల బయటకు, బహిరంగ ప్రదేశాలకు రావాలని, గ్యాస్ బండలకు పూల దండలు వేసి గంటలు, డ్రమ్స్, పళ్లాలు, ఇతర పరికరాలు మోగించాలని కోరింది. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల అంశాన్ని ఈ మేరకు చెవిటి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా శనివారం పిలుపునిచ్చారు.
కాగా, ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపుపై మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు ‘మెహంగాయి ముక్త్ భారత్ అభియాన్’ పేరుతో వారం రోజులు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది.
#WATCH | Youth Congress workers hold protest against the increase in prices of diesel-petrol and LPG gas cylinders in Delhi. pic.twitter.com/aRnnanXiIW
— ANI (@ANI) March 26, 2022