Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Gulam Nabi Azad | కశ్మీర్ (Kashmir) పై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత (NC Chief) ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) తప్పుబట్టారు. ఫరూక్ అబ్దుల్లాపై తనకు గౌరవం ఉందని, అయితే కశ్మీర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు.
Gulam Nabi Azad : కశ్మీర్ (Kashmir) పై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత (NC Chief) ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) చేసిన వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ (Gulam Nabi Azad) తప్పుబట్టారు. ఫరూక్ అబ్దుల్లాపై తనకు గౌరవం ఉందని, అయితే కశ్మీర్ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. పాకిస్థాన్ (Pakistan) భారతదేశంతోపాటు జమ్మూకశ్మీర్ ప్రజలకు కూడా శత్రువేనని చెప్పారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలు తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారని ఆజాద్ గుర్తుచేశారు.
పీవోకేలో పరిస్థితులను చూస్తే.. కశ్మీర్ ప్రజలకు పాకిస్థాన్ రక్షణగా నిలుస్తోందని ఎలా చెప్పగలమని ఆజాద్ ప్రశ్నించారు. 1947 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి కృషి చేశాయని పేర్కొన్నారు. ఫరూక్ అబ్దుల్లా శనివారం బారాముల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ ప్రస్తావించడం వల్లే ఆ ప్రాంతానికి రక్షణ లభిస్తోందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి న్యాయం ఆశించగలమా..? అని ప్రశ్నించారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఫరూక్‌పై పోలీసు చర్యలు తీసుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ కోరారు. మాజీ మంత్రి ఇమ్రాన్ అన్సారీ కూడా ఫరూక్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

