కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురు
కుప్పకూలిన భవనం | మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్‌నగర్ పట్టణంలో శనివారం మధ్నాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని పోలీసులు రక్షించారు. ఇంకా ఐదుగురు వాటికిందే ఉన్నట్లు భావిస్తున్నారు.

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ నాలుగు అంతస్తుల నివాస భవనం కుప్పకూలింది. ఉల్లాస్‌నగర్ పట్టణంలో శనివారం మధ్నాహ్నం ఈ ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 11 మందిని పోలీసులు రక్షించారు. ఇంకా ఐదుగురు వాటికిందే ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
క్యాంపు నెంబర్ 1 ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనం (జీ-ఫ్లస్ 4) మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాల సమయంలో కుప్పకూలడంతో చాలామంది శిథిలాల కింద చిక్కుకున్నారని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం ముఖ్య అధికారి సంతోశ్ కదం తెలిపారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని శిథిలాల కింద చిక్కుకున్న 11 మందిని రక్షించారు. గాయపడిన వారిని ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలించారు. శిథిలాల కింద ఉన్న మరో ఐదుగురిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బందికి విపత్తు నిర్వహణ బృందం సహాయం అందిస్తున్నదని అధికారులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

