Nepal: నేపాల్ నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు.. ఇంకా ఆచూకీలేని 51 మంది.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Nepal : నేపాల్‌లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
కాఠ్మాండు: నేపాల్(Nepal)లో కొండచరియలు విరిగిపడడంతో.. రెండు బస్సులు త్రిశూలీ నదిలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఆ బస్సుల్లో ఉన్న సుమారు 51 మంది ఆచూకీ గల్లంతు అయ్యింది. వారి కోసం ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. హిమాలయ దేశం నేపాల్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ రెండు బస్సుల్లో మొత్తం 54 మంది ప్యాసింజెర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రోడ్డు మార్గంలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి.
నేపాలీ ఆర్మీ, నేపాల్ పోలీస్, గత ఈతగాళ్లు.. సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. బిర్గుంజ్ నుంచి కాఠ్మాండుకు వెళ్తున్న బస్సులో 24 మంది ఉన్నారు. దాంట్లో ఏడుగురు భారతీయులు ఉన్నారు. ఇక కాఠ్మాండు నుంచి గౌర్ వెళ్తున్న బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ముగ్గురు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. సెర్చ్ ఆపరేషన్‌లో సుమారు 500 మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. శుక్రవారం రాత్రి గాలింపు చర్యల్ని నిలిపివేశారు. నది ఉదృతంగా ప్రవహిస్తున్న కారణంగా సెర్చ్ ఆపరేషన్ ఆలస్యమైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు మళ్లీ గాలింపు మొదలుపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
One Lakh Crore | నెలకు రూ.10వేల జీతం.. కానీ బ్యాంక్ అకౌంట్లో లక్ష కోట్లు.. చివరకు షాక్!
Rajeev Kanakala | ‘డ్రాగన్’తో ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేయడం ఖాయం.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

