Bournvita | హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి బోర్న్‌విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు
Bournvita | ఈ కామర్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది (Centres Big Order). బోర్న్‌విటా (Bournvita) సహా ఇతర పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ (Health Drinks) కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది.
Bournvita | ఈ కామర్స్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది (Centres Big Order). బోర్న్‌విటా (Bournvita) సహా ఇతర పానీయాలను ‘హెల్త్ డ్రింక్స్’ (Health Drinks) కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. బోర్న్‌విటాలో చక్కర స్థాయిలు పరిమితికి మించి అధికంగా ఉన్నాయని ఇటీవలే ఎన్సీపీసీఆర్ నిర్ధారించిన విషయం తెలిసిందే.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (CPCR) చట్టం-2005లోని సెక్షన్ 3 కింద ఏర్పాటైన బాలల హక్కుల పరిరక్షణ సంస్థ ఎన్సీపీసీఆర్ (నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) ఇటీవలే సీఆర్పీసీ-2005 చట్టంలోని సెక్షన్ 14 కింద విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో ‘హెల్త్ డ్రింక్’ అని దేన్నీ నిర్వచించలేదని నిర్ధారణకు వచ్చినట్లు కేంద్రం ఏప్రిల్ 10 నాటి నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే బోర్న్‌విటా సహా కూల్‌డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి వెంటనే తొలగించాలని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించింది.
బోర్న్‌విటాలో చక్కెర స్థాయిలు (sugar levels) అధికంగా ఉన్నాయని ఓ యూట్యూబర్ తన వీడియోలో విమర్శించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని సదరు యూట్యూబర్ విమర్శించాడు. దీనిపై ఎన్సీపీసీఆర్కు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్సీపీసీఆర్ విచారణ జరపగా.. బోర్న్‌విటాలో అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అన్ని ఈ కామర్స్ కంపెనీలు, పోర్టల్స్ నుంచి బోర్న్‌విటా సహా అన్ని డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్ డ్రింక్స్’ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది.
Also Read..
BJP Manifesto | బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఖరారు..!
Sonu Sood | షూ దొంగిలించిన స్విగ్గీ డెలివరీ బాయ్‌కి అండగా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

