Mayawati : ఇటీవల బీహార్ (Bihar) లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) ఒక ముస్లిం మహిళ ముఖంపై ఉన్న హిజాబ్ (Hijab) ను లాగడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈ అంశంపై స్పందించారు. ఘటనపై నితీశ్ కుమార్ సారీ చెప్పాలని సలహా ఇచ్చారు.
నితీశ్ తన తప్పును ఒప్పుకుని సారీ చెప్పకుండా పెద్దది చేశారని, కొందరు మంత్రులు, ఇతరుల వ్యాఖ్యలు ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాయని మాయావతి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇలా జరగడం దురదృష్టకరమని, అది చింతించాల్సిన విషయమని అభిప్రాయం వ్యక్తంచేశారు. వైద్యులకు అప్పాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేసే ఆ కార్యక్రమంలో మహిళల భద్రతకు, గౌరవానికి భంగం కలుగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉండెనని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ ఘటనపై క్షమాపణ చెప్పి విషయం మరింత పెద్దది కాకుండా చూసుకోవాల్సి బాధ్యత ఉండెనని మాయవతి పేర్కొన్నారు. ఇప్పటికైనా సారీ చెప్పి వివాదానికి తెరదించాలని సలహా ఇచ్చారు.