Gujarat High Court | సప్తపది లేని పెళ్లి పెళ్లే కాదు.. హిందూ వివాహాలపై గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు
Gujarat High Court | హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను చాటిచెబుతూ గుజరాత్ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ సంప్రదాయాల ప్రకారం 'సప్తపది' (ఏడడుగులు) వంటి శాస్త్రోక్తమైన క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టంచేసింది.
Gujarat High Court : హిందూ వివాహ వ్యవస్థ విశిష్టతను చాటిచెబుతూ గుజరాత్ హైకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హిందూ సంప్రదాయాల ప్రకారం ‘సప్తపది’ (ఏడడుగులు) వంటి శాస్త్రోక్తమైన క్రతువులు నిర్వహించకుండా కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ పెళ్లి చట్టబద్ధంగా చెల్లుబాటు కాదని హైకోర్టు స్పష్టంచేసింది. హిందూ వివాహం అనేది కేవలం ‘పాటలు, డ్యాన్స్‌లు, విందు వినోదాల’ కోసం జరుపుకునే వేడుక కాదని వ్యాఖ్యానించింది. వధూవరులు పవిత్రమైన అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయడమే వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదాను కల్పిస్తుందని జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్టీ వాచ్ఛానిల బెంచ్ తేల్చిచెప్పింది.
యూకేలో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే వ్యక్తి అప్పీల్‌పై విచారణ జరుపుతూ కోర్టు ఈ తీర్పునిచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన ఒక మహిళ తన సంతకాలను మోసపూరితంగా సేకరించి మ్యారేజ్ సర్టిఫికేట్ పొందిందని, తమ మధ్య ఎలాంటి సంప్రదాయ వివాహ క్రతువులు జరగలేదని కౌశల్ కోర్టును ఆశ్రయించాడు. గతంలో ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో సదరు మహిళ కూడా తమ మధ్య ఎలాంటి పెళ్లి ఆచారాలు జరగలేదని అంగీకరించింది. దాంతో హిందూ వివాహ చట్టం ప్రకారం సప్తపది లేని వివాహం అసలు పెళ్లే కాదని హైకోర్టు స్పష్టంచేసింది. గతంలో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ.. సప్తపది లేని పెళ్లి చెల్లదని తీర్పునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

