శరద్ పవార్ పార్టీలో తిరుగుబాటు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గాలు బీజేపీతో జత కట్టాలని ఉమ్మడిగా ఆలోచిస్తున్న వేళ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, సామ్యవాద భావాలను అనుసరించే తన ముని మేనల్లుడు రోహిత్ పవార్, మరికొందరు నాయకుల నుంచి తిరుగుబాటు ముప్పు ఎదుర్కొంటున్నారు.
- ఎన్డీయేలో ఎన్సీపీ వర్గాల విలీన అవకాశం!
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లోని రెండు వర్గాలు బీజేపీతో జత కట్టాలని ఉమ్మడిగా ఆలోచిస్తున్న వేళ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, సామ్యవాద భావాలను అనుసరించే తన ముని మేనల్లుడు రోహిత్ పవార్, మరికొందరు నాయకుల నుంచి తిరుగుబాటు ముప్పు ఎదుర్కొంటున్నారు. రెండు ఎన్సీపీ వర్గాల విలీనంపై శరద్ పవార్ వర్గంలో విభేదాలు వ్యక్తమయ్యాయి. పలువురు నాయకులు పార్టీ పునరేకీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ, మహారాష్ట్రలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వంలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రోహిత్ పవార్, మరికొందరు నాయకులు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగమయ్యే ప్రతిపాదన పట్ల విముఖత చూపుతున్నారు. రెండు వర్గాల విలీనాన్ని బీజేపీ పొత్తుతో ముడి పెట్టకూడదని వారు వాదిస్తున్నారు. బీజేపీ కూటమిలో భాగం కావడం కంటే ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాన్ని అన్వేషించడానికే తాము మొగ్గు చూపుతున్నామని వారు స్పష్టం చేసినట్టు సమాచారం. శరద్ పవార్ బీజేపీతో పొత్తు పెట్టుకొంటే, కాంగ్రెస్‌లో చేరాలని రోహిత్ పవార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

