జెన్సెన్ను మళ్లీ సీఈవోగా తీసుకోండి!
రాజీనామా చేసిన జెన్సెన్ హువాంగ్ను మళ్లీ సీఈవోగా నియమించాలని ఎన్విడియా ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. వైర్డ్ వార్తా నివేదిక ప్రకారం..జెన్సెన్ను మళ్లీ సీఈవోగా తీసుకోవాలని కంపెనీ ‘అంతర్గత సలహా బాక్స్'కు సుమారు 1600 మంది ఉద్యోగులు సందేశాలు పంపారు.
- 1600 మంది ఉద్యోగుల డిమాండ్
- ఆయన స్థానంలో టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ సూచన
వాషింగ్టన్: రాజీనామా చేసిన జెన్సెన్ హువాంగ్ను మళ్లీ సీఈవోగా నియమించాలని ఎన్విడియా ఉద్యోగులు కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. వైర్డ్ వార్తా నివేదిక ప్రకారం..జెన్సెన్ను మళ్లీ సీఈవోగా తీసుకోవాలని కంపెనీ ‘అంతర్గత సలహా బాక్స్’కు సుమారు 1600 మంది ఉద్యోగులు సందేశాలు పంపారు. ‘మీకు లక్ష్యంపై నమ్మకముంటే బాస్‌ను వెనక్కు తీసుకురండి’ అని ఒక అజ్ఞాత ఉద్యోగి సూచించారు.
‘మనమంతా మనుషులమే..తప్పులు చేయొచ్చు..జెన్సెన్ చాలా మంచి పనులు చేశారు, ఆయనకు రెండో అవకాశం అవసరం’ అని మరొకరు పేర్కొన్నారు. లింక్డ్ఇన్లో సుమారు రెండు డజన్ల మంది ఉద్యోగులు ఆయనకు మద్దతు తెలిపారు. ఆయన ఎందుకు రాజీనామా చేశారో మరింత వివరంగా తెలపాలని ఒక ఉద్యోగి కంపెనీకి ఈ-మెయిల్ చేశారు. మరోవైపు జెన్సెన్ స్థానంలో యాపిల్ కంపెనీ మాజీ సీఈవో టిమ్ కుక్‌ను నియమించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం సూచించారు.
రేసులో ముగ్గురు భారతీయులు
భారత సంతతికి చెందిన ముగ్గురు టెక్ నిపుణులు ఎన్విడియా సీఈవో రేసులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మైక్రాన్ సీఈవో సంజయ్ మల్హోత్రా అందులో ఒకరు. ఎన్విడియాతో దగ్గరగా పనిచేసిన ఆయనకు నాలుగు దశాబ్దాల పని అనుభవం ఉంది. పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈవో నికేశ్ అరోరా కూడా పోటీలో ఉన్నారు. ఆయన గతంలో సాఫ్ట్‌బ్యాంక్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గూగుల్‌లో పదేండ్ల పాటు సేవలందించారు. ఇక గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తున్నది. కస్టమర్స్, టెక్నాలజీ విభాగాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

