న్యూఢిల్లీ, మే 12: ఎవరూ క్లెయిమ్ చేసుకోని బ్యాంక్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. 100 రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని శుక్రవారం వెల్లడించింది. అధికారులు అన్ని జిల్లాల్లోని ప్రతి బ్యాంకులో టాప్ 100 క్లెయిమ్ కాని(అన్ క్లెయిమ్డ్) డిపాజిట్లను గుర్తించి, వాటిని పరిష్కరించే పని చేపడుతారని ఆర్బీఐ పేర్కొన్నది.
ఈ ప్రత్యేక డ్రైవ్ ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలవుతుందని తెలిపింది. సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతాను 10 ఏండ్ల పాటు నిర్వహించకున్నా లేదా మెచ్యూరిటీ అయినప్పటికీ, టర్మ్ డిపాజిట్లను 10 ఏండ్ల పాటు క్లెయిమ్ చేసుకోకున్నా.. వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పేర్కొంటారు. హక్కుదారులు క్లెయిమ్ చేసుకోకుంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను డీఈఏకు బదిలీ చేస్తారు.