చెన్నై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) అస్వస్థతకు గురతయ్యారు. గుండె నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సీనియర్ వైద్యులతో కూడిన బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించారు. ఇది అత్యవసర చికిత్స కాదని పేర్కొన్నారు.
కాగా, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం వచ్చే నెల 10న ముగియనుంది. 1980 తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్.. 2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేంద్రం శక్తికాంత దాస్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆయన పదవిలో కొనసాగుతున్నారు. 2021 డిసెంబర్ 10న మూడేళ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ మరో మూడేండ్ల పాటు పదవీకాలన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ ప్రకారం వచ్చే నెల డిసెంబర్‌తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. అయితే, మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐదేండ్ల కంటే ఎక్కువకాలం ఆర్బీఐ గవర్నర్‌గా దాస్ ఉన్నారు. మరోసారి ఆయన పదవీకాలం పొడిగిస్తే.. బెనగల్ రామారావు (Benegal Rama Rau) తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా చేసిన వ్యక్తిగా దాస్ నిలవనున్నారు. రామారావు 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటివరకు ఆయనే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన తర్వాత అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా దాస్ నిలవనున్నారు.
The Reserve Bank Governor, Shaktikanta Das IAS, has been admitted to #Chennai Apollo Hospital due to chest pain. He is currently under the close supervision of medical professionals: sources #RBI pic.twitter.com/P0Z26uq8Dl
— Mahalingam Ponnusamy (@mahajournalist) November 26, 2024