Karnataka congress | కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఝలక్.. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొన్న బీజేపీ
Karnataka congress | కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ 2 చోట్ల గెలిచింది.
- డిప్యూటీ సీఎం డీకే సోదరుడు సురేశ్ ఓటమి
- 42 వేల ఓట్ల తేడాతో ప్రజ్వల్ పరాజయం
బెంగళూరు, జూన్ 4: కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలోని 28 స్థానాలకుగానూ 17 సీట్లను ప్రతిపక్ష బీజేపీ కైవసం చేసుకోగా.. హస్తం పార్టీ తొమ్మిది స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ 2 చోట్ల గెలిచింది. గెలిచిన వారిలో మాజీ సీఎంలు బసవరాజ్ బొమ్మై, హెచ్డీ కుమారస్వామి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే అల్లుడు రాధాక్రిష్ణ దొడ్డమణి ఉన్నారు.
మరోవైపు రాష్ట్ర డిప్యూటీ సీఎం, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ బెంగళూరు రూరల్ లోక్‌సభ స్థానం నుంచి 2,69,647 లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి, దేవెగౌడ అల్లుడు సీఎన్ మంజునాథ్ చేతిలో ఘోర పరాజయం చవిచూశారు. గత కొన్ని రోజులుగా సెక్స్ స్కాండల్ ఆరోపణల్లో నలుగుతున్న ప్రజ్వల్ రేవణ్ణ పరాజయం పాలయ్యారు. హసన్ నుంచి పోటీచేసిన ప్రజ్వల్ రేవణ్ణ కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ ఎం పటేల్ చేతిలో 42,649 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కర్ణాటక (28)
ఎన్డీయే 19
ఇండియా 9
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

