Rape Accused Shot Victim | బెయిల్‌పై బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు.. బాధితురాలిని కాల్చి చంపాడు
Rape Accused Shot Victim | బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.
లక్నో: బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చిన అత్యాచార నిందితుడు దారుణానికి పాల్పడ్డాడు. బాధిత యువతిపై కాల్పులు జరిపి హత్య చేశాడు. (Rape Accused Shot Victim) ఈ విషయం తెలిసిన పోలీసులు నిందితుడితోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని శంభాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 20 ఏళ్ల రింకూ 17 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.
కాగా, అత్యాచార నిందితుడు రింకూ ఈ నెలలో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. సెప్టెంబర్ 18న రాత్రి వేళ తల్లితో కలిసి సోదరుడి బైక్‌పై వెళ్తున్న బాధిత యువతిని తన స్నేహితుడితో కలిసి అడ్డుకున్నాడు. ఆమెపై గన్‌తో కాల్పులు జరిపి హత్య చేశాడు.
మరోవైపు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రింకూ, అతడి అనుచరుడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

