Surya Tilak | శ్రీరామ జన్మభూమి అయోధ్యలో శ్రీరామ నవమి (Ram Navami ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కడ నూతనంగా నిర్మించిన రామ మందిరంలో (Shri Ram Janmabhoomi Temple) బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మరికాసేపట్లో అక్కడ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాముడి నుదుటన సూర్య కిరణాలు (Surya Tilak) ప్రసరించనున్నాయి. మధ్యాహ్నం 12:16 గంటల సమయంలో సూర్య కిరణాలు బాలరాముడి నుదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించనున్నాయి.
ఏటా శ్రీరామనవమి రోజున రాముడి విగ్రహం నుదుటన సూర్య కిరణాలు ప్రసరించేలా అధికారులు ఆలయ నిర్మాణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏటా ఈ పండుగ వేళ మధ్యాహ్నం సమయంలో బాలరాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. దీన్నే సూర్య తిలకంగా అభివర్ణిస్తారు. ఇందు కోసం ఆలయ మూడో అంతస్తులో ప్రత్యేక అద్దాలను ఏర్పాటు చేశారు. ఈ సూర్యకిరణాల తిలకం 58 మిల్లీ మీటర్ల పరిమాణంతో ఉంటుంది. ఇందులో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో తిలకంగా కనిపిస్తుంది. ఇక ఇవాళ తొలిసారి ఆలయంలో ఆ దృశ్యం కనిపించనుంది. దీంతో ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివెళ్లారు.
Also Read..
Ram Navami | రామ్‌లల్లాకు దివ్యాభిషేకం.. అయోధ్యలో ఘనంగా నవమి వేడుకలు
PV Sindhu | తిరుమల శ్రీవారి సేవలో స్టార్ షట్లర్ పీవీ సింధు
MK Stalin | మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశం 200 ఏళ్ల వెనక్కి వెళుతుంది : సీఎం స్టాలిన్