న్యూఢిల్లీ, జూలై 27: సినిమాటోగ్రఫీ బిల్లును గురువారం రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952కు సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ (చట్ట సవరణ) బిల్లు-2023ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్లో కనిపించకుండా అడ్డుకట్ట పడనున్నది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సినిమాలకు జారీ చేసే సర్టిఫికెట్ల విధానంలోనూ మార్పులు రానున్నది. యూ, యూ/ఏ, ఏ, ఎస్ సర్టిఫికెట్ల స్థానంలో ఇకపై వయసు ఆధారిత సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.