రైలు పట్టాలపై మొసలి.. అరగంట నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్

అహ్మదాబాద్: రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించి స్టేషన్ సూపరింటెండెంట్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను సుమారు అరగంట నిలిపివేశారు. గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ ఘటన జరిగింది. వడోదర-ముంబై మార్గంలోని కర్జన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే పట్టాలపై రైలు ఢీకొని గాయపడిన మొసలిని ట్రాక్ తనిఖీ సిబ్బంది మంగళవారం ఉదయం గమనించారు. ఈ విషయాన్ని కర్జన్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్‌కు చెప్పారు. దీంతో ఆయన వన్యప్రాణుల సంరక్షణ సిబ్బందికి ఫోన్ చేశారు.
కాగా, ఆ సిబ్బంది వాహనంలో ఆ స్పాట్‌కు చేరేందుకు మార్గం లేదు. దీంతో వారు స్టేషన్‌కు వచ్చే వరకు వడోదర-ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను కర్జన్ రైల్వే స్టేషన్లో నిలిపి ఉంచారు. దీంతో ఆ సిబ్బంది రైలు ఎక్కి సంఘటనా స్థలానికి వెళ్లారు. పట్టాల మధ్యలో తలకు గాయమైన మొసలిని గమనించారు. దానిని పట్టాల పక్కకు చేర్చగా అక్కడ మరో ఐదు నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్ ముందుకు కదిలింది.
మరోవైపు ఎనిమిది అడుగుల పొడవైన ఆ మొసలి అనంతరం కొంతసేపటికే చనిపోయినట్లు వణ్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు హేమంత్, నేహా తెలిపారు. మరణించిన ఆ భారీ మొసలిని ఆ తర్వాత కిసాన్ రైలులో తరలించి కర్జన్ అటవీశాఖకు అప్పగించినట్లు స్టేషన్ సూపరింటెండెంట్ సంతోష్ శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటన వల్ల ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్‌ప్రెస్ సుమారు 25 నిమిషాలు నిలిచిపోగా, మిగతా రైళ్లు సుమారు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

