Rajasthan Minister | మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజస్థాన్ బీజేపీ నేత
Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Rajasthan Minister | రాజస్థాన్ మంత్రి (Rajasthan Minister) కిరోడి లాల్ మీనా ( Kirodi Lal Meena) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ.. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని సీఎంకు అందజేశారు. ‘కిరోడి మీనా మంత్రి పదవికి రాజీనామా చేశారు. 10 రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు’ అని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి.
కాగా ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 25 స్థానాలకు గానూ బీజేపీ 14 స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుని దౌసాతో సహా ఎనిమిది స్థానాలను దక్కించుకోగలిగింది. ఇక ఇతర పార్టీలు మూడు స్థానాల్లో గెలుపొందారు. అయితే ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం తనకు అప్పగించిన దౌసా స్థానం సహా ఏడు లోక్‌సభ స్థానాల్లో ఒక్కటి ఓడిపోయినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరోడి హామీ ఇచ్చారు (poll promise). ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేశారు.
గతేడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 72 ఏళ్ల కిరోడి లాల్ మీనా సవాయి మాధోపూర్ నుంచి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో 200 నియోజకవర్గాలకు గానూ బీజేపీ అత్యధికంగా 115 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ 66 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక రాష్ట్ర కేబినెట్లో వ్యవసాయం, ఉద్యానవనం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ, సహాయ, పౌర రక్షణ వంటి శాలకు మంత్రిగా కిరోడి వ్యవహరించారు.
Also Read..
Thief | ఇంటిని దోచుకుని.. నెలలో తిరిగిచ్చేస్తానంటూ లేఖ రాసిన దొంగ
Anant Weds Radhika | అంబానీ ఇంట సంప్రదాయ మామేరు వేడుక.. మెరిసిపోయిన పెళ్లికూతురు.. వీడియోలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

