అక్రమంగా 40 విల్లాల కొనుగోలు
తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అక్రమంగా 40 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేసిన ఐఏఎస్-ఐపీఎస్ అధికారుల దంపతులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- ఐఏఎస్-ఐపీఎస్ దంపతుల అవినీతి
- రాజస్థాన్‌లో ఏసీబీ దర్యాప్తు
జైపూర్ : తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అక్రమంగా 40 విల్లాలు, కాటేజీలను కొనుగోలు చేసిన ఐఏఎస్-ఐపీఎస్ అధికారుల దంపతులపై రాజస్థాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఐపీఎస్ అధికారి అయిన ప్రకాశ మాథూర్‌ను వెయిటింగ్ పోస్టింగ్ ఆర్డర్స్ (ఏపీవో-కొత్త పోస్టింగ్ ఇచ్చే వరకు విధులకు దూరంగా ఉంచడం)లో ఉంచింది. ఐఏఎస్ అధికారి అయిన ఆమె భర్త శిఖర్ అగర్వాల్‌పై కొద్ది రోజుల క్రితమే ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. 40 విల్లాలు, కాటేజీలను అక్రమంగా కొనుగోలు చేసిన ఆరోపణలపై అగర్వాల్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తు జరుపుతున్నది.
మాథుర్ పేరుపై ఈ 40 విల్లాలు రిజిస్టర్ చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు పరిపాలనా కారణాలతో ఆమెను ఏపీవోకు పంపుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పలు కీలక పదవులు నిర్వహించిన అగర్వాల్ తన, తన కుటుంబ సభ్యుల పేర్లపై పలు ఆస్తులకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిపినట్టు అధికారులు గుర్తించారు. ఇతడిని కూడా అక్టోబర్ 28న ఏపీవోకు పంపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

