ముంబై: రాజకీయ శతృత్వం ఉన్న సోదరులైన రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేలు ఒక వేడుకలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Raj-Uddhav Reunite) మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సోదరి కుమారుడి వివాహం ముంబైలోని దాదర్లో జరిగింది. రాజ్ ఠాక్రేతోపాటు శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తమ కుటుంబాలతో కలసి ఈ పెళ్లికి హాజరయ్యారు. వారిద్దరూ కలిసి వరుడైన మేనల్లుడు, వధువుపై అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాజ్, ఉద్ధవ్ ఠాక్రేలు పరస్పరం మాట్లాడుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీల నేతల మాటల దాడికి పాల్పడ్డారు. అయితే ఎన్నికల్లో సత్తా చాటలేకపోయారు. ఎంఎన్ఎస్ ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది. ముంబైలోని మహిమ్ స్థానం నుంచి పోటీ చేసిన రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే కూడా ఓడిపోయారు.
మరోవైపు శివసేన (యూబీటీ) కేవలం 20 సీట్లు గెలుచుకున్నది. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి అయిన ఆదిత్య ఠాక్రే తిరిగి వర్లీ సీటు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. శివసేనకు చెందిన మురళీ దేవరాపై గట్టి పోరులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
Mumbai: MNS president Raj Thackeray and Shiv Sena (UBT) chief Uddhav Thackeray were seen together at the wedding of Raj Thackeray’s sister Jaywanti Thackeray-Deshpande’s son in Dadar. The two were also seen conversing, and both families were present at the ceremony pic.twitter.com/cGfADDSs8X
— IANS (@ians_india) December 22, 2024