Railway Constable | కదులుతున్న రైలు ఎక్కుతుండగా జారిపడిన మహిళ.. రక్షించిన రైల్వే కానిస్టేబుల్
ప్లాట్‌ఫారమ్ నుంచి రైలు (Train) కదులుతున్నది. క్రమంగా స్పీడ్ అందుకుంటున్నది. ఇంతలో ఓ మహిళ పరుగున వచ్చి రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే పట్టు కోల్పోవడంతో కింద పడిపోయింది.
లక్నో: ప్లాట్‌ఫారమ్ నుంచి రైలు (Train) కదులుతున్నది. క్రమంగా స్పీడ్ అందుకుంటున్నది. ఇంతలో ఓ మహిళ పరుగున వచ్చి రైల్లోకి ఎక్కడానికి ప్రయత్నించింది. అయితే పట్టు కోల్పోవడంతో కింద పడిపోయింది. రైలుకు.. ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఉండే గ్యాప్‌లో ఇరుక్కుపోయింది. గమనించిన రైల్వే కానిస్టేబుల్ (Railway Constable) ఆమెను పైకిలాగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్నది.
గోరఖ్దామ్ ఎక్స్‌ప్రెస్ (Gorakhdam Express) గోండా రైల్వే స్టేషన్‌కు వచ్చి ఆగింది. కొద్దిసేపటి తర్వాత తిరిగి తన ప్రయాణం ప్రారంభించింది. క్రమంగా రైలు స్పీడ్ అందుకుంటుంగా ఓ మహిళ బోగీలోకి ఎక్కడానికి యత్నించింది. పట్టుసడలడంతో రైలు, ప్లాట్‌ఫామ్ మధ్య ఉండే సందులో పడిపోయింది. అక్కడే విధుల్లో ఉన్న రామ్‌సుందర్ జైస్వార్ (Ramsundar Jaiswar) అనే రైల్వే హెడ్‌కానిస్టేబుల్ చాకచక్యంగా ఆమెను పట్టుకున్నాడు. రైలు కింద పడిపోతున్న ఆమెను మరో వ్యక్తితో కలిసి పైకి లాగాడు. దీంతో స్వల్ప గాయాలతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్‌ను రైల్వే అధికారులతోపాటు స్థానిక ప్రజలకు ప్రశంసించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

