Rahul Gandhi | ట్రంప్‌కు మోదీ తలొగ్గుతారు.. యూఎస్-భారత్ ట్రేడ్ డీల్‌పై రాహుల్ గాంధీ విమర్శ
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత్-అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాని మోదీ.. అధ్యక్షుడు ట్రంప్ ముందు లొంగిపోతారని వ్యాఖ్యానించారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలకు ప్రధాని మోదీ తలొగ్గుతారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) గుండెలు బాదుకోవడం తప్ప ఏమీ చేయలేరు. నా మాటలు నమ్మకపోతే రాసిపెట్టుకోండి’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
భారత ఉత్పత్తులపై అమెరికా ఇప్పటికే 10 శాతం టారిఫ్ విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే, అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ భారత్ సహా పలు దేశాలపై అదనపు సుంకాలను ప్రకటించారు. ఏప్రిల్ 2న మన దేశంపై ట్రంప్ 26 శాతం అదనపు సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అదనపు సుంకాలను జులై 9 వరకూ నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం గతంలోనే ప్రకటించింది. అంతలోపు ఆయా దేశాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే, జులై 9 నుంచి అదనపు సుంకాలు వడ్డిస్తారు. అంతలోపే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ భావిస్తున్నాయి. ఈ అదనపు 26 శాతం సుంకం నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని భారత్ కోరుతోంది.
మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై (India-US trade deal) ఇరు దేశాలూ తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు చివరి దశకు వచ్చినట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాణిజ్య ఒప్పందంలో ఇరు దేశాలూ వ్యవసాయం, ఆటోమొబైల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, లేబర్ ఇంటెన్సివ్ ప్రొడక్ట్‌లపైనే ఎక్కువగా దృష్టి పెట్టాయి. దేశంలో అధిక ఉపాధి కల్పించే తమ ఎగుమతులపై సుంకాలను గణనీయంగా తగ్గించాలని భారత్ ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా వస్త్రాలు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల ఎగుమతులపై అర్థవంతమైన రాయితీల కోసం భారత్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయం, డెయిరీ రంగాల్లోనూ తమ ఉత్పత్తులకు పూర్తిస్థాయి మార్కెట్ ప్రవేశం కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కానీ, దేశంలోని గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత దృష్ట్యా ఈ రెండు కీలక రంగాలను ఒప్పందం పరిధి నుంచి దూరంగా ఉంచాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 9వ తేదీలోగా.. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి రానుంది. అయితే, రెండు దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటేనే వాణిజ్య ఒప్పందాన్ని భారత్ అంగీకరిస్తుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read..
“India-US | తుది దశలో చర్చలు.. 48 గంటల్లో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్..!”
“India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి గురుదక్షిణ వల్లే పాలమూరులో పంటలు ఎండిపోయాయి : హరీశ్ రావు
Fetal Back Surgery | భారత వైద్య రంగంలో అరుదైన ఘనత.. గర్భస్థ శిశువుకు విజయవంతంగా వెన్నెముక చికిత్స..
Burnt alive | జాతీయ రహదారిపై ప్రమాదం.. ఇద్దరు సజీవదహనం
Karthika Pournami | యాదగిరిగుట్టలో భక్తుల సందడి
Microsoft Employee | 24 ఏళ్లు నమ్మకంతో పనిచేస్తే.. ఒక్క మెయిల్‌తో ముగింపు.. మెక్రోసాఫ్ట్ ఉద్యోగిని ఎమోషనల్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

