Rahul Gandhi: పెల్లెట్ గన్ గాయాల బాధితుడితో కలిసి పోలీసు స్టేషన్లో రాహుల్ గాంధీ ధర్నా
Rahul Gandhi: పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. జూలై 20వ తేదీన జరిగిన సీజేపీ నిరసన సమయంలో పెల్లెట్ గాయాల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 19 ఏళ్ల సాహిల్‌కు గాయాలైనట్లు ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్లో ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ధర్నా చేపట్టారు. జూలై 20వ తేదీన జరిగిన సీజేపీ నిరసన సమయంలో పెల్లెట్ గాయాల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శాంతియుత ప్రదర్శన చేపడుతున్న ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడినట్లు రాహుల్ ఆరోపించారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌లోని డీసీపీ ఆఫీసులో రాహుల్ చాలా సేపు బైఠాయించారు. పెల్లెట్ గాయాలైన సాహిల్ లోచవ్ అనే వ్యక్తిని కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
సాహిల్ లోచవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్స్ వాడకం పట్ల హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ, ప్రధాని మోదీ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. 19 ఏళ్ల బాధిత వ్యక్తి సాహిల్‌తో కలిసి రాహుల్ మందిర్ మార్గ్ పోలీసు స్టేషన్ వెళ్లారు. అక్కడ ఫిర్యాదు స్వీకరించేందుకు నిరాకరించడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ధర్నాలో ప్రియాంగా గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
#WATCH | Delhi: At Parliament Street Police Station, Lok Sabha LoP Rahul Gandhi says, “Pellet gun was used at Connaught Place on 20th July. AIIMS report clearly says that there are more than 200 shells inside his body and 3 in his eye. He has lost vision in that eye. There are… pic.twitter.com/kH0WGVMuBa
— ANI (@ANI) August 21, 2026
సాహిల్ శరీరంలో సుమారు 200 పెల్లెట్లు ఉన్నట్లు ఎయిమ్స్ తన రిపోర్టులో పేర్కొన్నది. 3 పెల్లెట్స్ కంటిలో దిగినట్లు రాహుల్ చెప్పాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

